: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు అస్వస్థత.. చికిత్స కోసం బెంగళూరుకు!
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఆయన బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగాయని, చికిత్స నిమిత్తం బెంగళూరుకు వెళ్లనున్నారని సమాచారం. ఈ నెల 7వ తేదీన అక్కడికి వెళతారని, సుమారు పది నుంచి పన్నెండు రోజులు చికిత్స తీసుకోనున్నారని ఒక వార్తా సంస్థ కథనం. కాగా, పంజాబ్, గోవా ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తొలిసారిగా పోటీ పడుతోంది. పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికలలో ఆప్, కాంగ్రెస్, బీజేపీ ల మధ్ త్రిముఖ పోటీ నెలకొంది.