: ఆర్టీసీ హెల్పర్ బస్సు నడిపేందుకు యత్నించగా ప్రమాదం... సీనియర్ మెకానిక్ మృతి!


ఆర్టీసీ గ్యారేజ్ లో బస్సును నడిపేందుకు యత్నించిన హెల్పర్ ఒక సీనియర్ మెకానిక్ ను ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ పరిధిలోని గ్యారేజ్ లో దుర్గారావు అనే వ్యక్తి హెల్పర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బస్సు నడిపేందుకు యత్నించగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న సీనియర్ మెకానిక్ సత్యనారాయణను ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ సంఘటనపై ఎంప్లాయిస్ యూనియన్ నేతలు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సదరు హెల్పర్ కు బస్సు ఎవరు ఇచ్చారనే విషయమై వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనకు ఆర్టీసీ అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు మాత్రం ఆ హెల్పర్ కు బస్సు నడపమని ఎవరు చెప్పారో తమకు తెలియదని చెబుతున్నారు. ఈ ప్రమాద సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News