: 'కాటమరాయుడు' ఆల్ టైం రికార్డు ఖాయమట!
నిన్న విడుదలైన పవన్ కల్యాణ్ 'కాటమరాయుడు' టీజర్ యూ ట్యూబ్ లో ఆల్ టైం రికార్డు దిశగా దూసుకెళుతోంది. టీజర్ విడుదలైన రెండు గంటల్లోనే మిలియన్ (పది లక్షలు) వ్యూస్ రాగా, ఆపై మరో నాలుగున్నర గంటల్లో ఇంకో మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో తెలుగు చిత్రాల 24 గంటల రికార్డును 'కాటమరాయుడు' తిరగరాస్తుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. ఈ మధ్యాహ్నం 11:40 గంటల సమయానికి టీజర్ విడుదలై 20 గంటలవుతుండగా, 27,89,262 మంది దీన్ని వీక్షించారు. తమిళ చిత్రం 'వీరమ్'కు రీమేక్ గా కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో ఇది రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఓ ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తుండగా, ఆయనకు జోడీగా శ్రుతిహాసన్ నటిస్తోంది.