: నేటి సమావేశం శశికళ కోసం కాదు... ఆమె ముఖ్యమంత్రి కాబోరు: స్పష్టం చేసిన తమిళనాడు మంత్రులు


నేడు సమావేశమయ్యే అన్నాడీఎంకే శాసనసభ్యులు తమ నేతగా వీకే శశికళను ఎన్నుకుంటారని, ఆపై ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వస్తున్న వార్తలకు తమిళనాడు మంత్రులు తెరదించారు. ఈ సమావేశం శశికళ కోసం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం, ఎమ్మెల్యేల మధ్య ముఖాముఖి సంప్రదింపుల కోసం ఈ భేటీని నిర్వహిస్తున్నామని, మరే ఉద్దేశాలు లేవని సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు.

తమ పనులను చేసి పెట్టాలని పలువురు శాసనసభ్యులు కోరుతున్నారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం, ఎమ్మెల్యేల మధ్య డైరెక్ట్ కమ్యూనికేషన్ పెరిగేలా చూసేందుకు నేడు సమావేశం కావాలని నిర్ణయించామని అన్నారు. జయలలిత ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి, ఆమె పథకాలను కొనసాగించే దిశగా ప్రజా ప్రతినిధుల సలహా, సూచనలు తీసుకోవాలన్నది శశికళ అభిప్రాయమని, పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న అనుబంధం ఈ సమావేశం తరువాత మరింతగా పెరుగుతుందన్న నమ్మకం ఉందని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News