: ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కోసం ప్రచారం చేయనున్న చిరంజీవి: నాగబాబు


2019లో అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తే, తన తమ్ముడు పవన్ కల్యాణ్ కోసం అన్న చిరంజీవి ప్రచారం చేస్తారని నాగబాబు వెల్లడించారు. పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేస్తే, తమ కుటుంబమంతా అండగా నిలుస్తుందని టీవీ 9 న్యూస్ చానల్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో నాగబాబు తెలిపారు. ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కు చిరంజీవి మద్దతు ఇస్తేనే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో తాను ఓసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని కూడా ఈ కార్యక్రమానికి చెందిన ప్రోమోలో నాగబాబు వెల్లడించారు.  ఇంటర్వ్యూ నేడు సాయంత్రం ప్రసారం కానుంది.

  • Loading...

More Telugu News