: గంగూలీ గురించి ట్వీట్ చేసిన సెహ్వాగ్


సోషల్ మీడియాలో తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ ఆకట్టుకుంటున్న టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాజీ దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీని గుర్తుచేసుకుంటూ చేసిన ట్వీట్ అందర్నీ ఆకట్టుకుంటోంది. దాని వివరాల్లోకి వెళ్తే...రెండు పాండాల ఫొటోలను పోస్ట్‌ చేసిన సెహ్వాగ్ కళ్లద్దాలు పెట్టుకోకుంటే ఇలా ఉండే వ్యక్తి ఎవరంటూ ప్రశ్నించాడు. కాసేపైన తరువాత మరో ట్వీట్ చేస్తూ కళ్లచుట్టూ నలుపు చారలున్నది సౌరవ్ గంగూలీ అని, కళ్ల చుట్టూ చారలు లేని పాండా చైనీస్‌ గంగూలీ అని అన్నాడు. గంగూలీ భారీ షాట్ కి వెళ్లేముందు కనురెప్పలు వేగంగా ఆడించి, తరువాత భారీ షాట్ కు వెళ్తాడన్న సంగతి అతని అభిమానులు, క్రికెట్ ప్రియులకు తెలిసిందే.

దీనిని గుర్తు చేసిన సెహ్వాగ్...కళ్లు మిటకరిస్తూ స్పిన్నర్ల బౌలింగ్‌ ను దీటుగా ఎదుర్కొంటూ వారి బంతులను స్డేడియం బయటకు అవలీలగా పంపేస్తాడని తన హీరో కెప్టెన్ గురించి సెహ్వాగ్ ట్వీట్లు చేశాడు.  ఈ ట్వీట్లపై అభిమానులు హర్షం వ్యక్తం చేయగా, స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ 'మజా ఆ గయా వీరూ బాయ్‌' అంటూ దానిని రీట్వీట్‌ చేశాడు.

  • Loading...

More Telugu News