: మిక్సీ మోటార్ రూపంలో బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
కొత్త కొత్త పద్ధతుల్లో బంగారాన్ని తరలించే ప్రయత్నాలు చేస్తూ అక్రమార్కులు అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ రోజు ముంబై ఎయిర్పోర్టులో ఇటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. బంగారాన్ని మిక్సీ మోటార్ లా రూపుదిద్ది అధికారుల దృష్టి మళ్లించి అక్రమ రవాణా చేయాలనుకున్న ఓ ప్రయాణికుడిని అధికారులు పట్టుకున్నారు. తాము స్వాధీనం చేసుకున్న ఆ బంగారం 1048 గ్రాములు ఉంటుందని మీడియాకు తెలిపారు. దాని విలువ రూ. 27,81,308గా ఉంటుందని తెలిపారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.