: తమిళనాడులో పావులు కదుపుతున్న శశికళకు షాక్!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ముఖ్యమంత్రి పదవి కోసం కూడా పావులు కదుపుతున్నారు. అందుకోసం రేపు అన్నాడీఎంకే శాసనసభా పక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరో ట్విస్ట్ ఎదురైంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదంటూ పార్టీ బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆ పార్టీకి ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు జయలలిత మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ, సీబీఐతో విచారణ చేయించాలని శశికళ పుష్ప వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.