: ఆ ముగ్గురూ మోసం చేశారు.. వారికి తలాక్ చెప్పడం ఖాయం: అసదుద్దీన్ ఒవైసీ


ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీలకు ఓటర్లు తలాక్ చెప్పడం ఖాయమని ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం అఖిలేష్ లకు తేడా ఏమీ లేదని... ఇద్దరూ నాణేనికి రెండు వైపుల వంటి వారని ఎద్దేవా చేశారు. ఓ టీవీ ఛానల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒవైసీ మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. ములాయం, అఖిలేష్, రాహుల్ గాంధీలను ముస్లింలు తమ నాయకులుగా గుర్తించారని... కానీ, వారంతా ముస్లింలను మోసం చేశారని మండిపడ్డారు. అందుకే తాను మీ ముందుకు రావాల్సి వచ్చిందని ఓటర్లకు ఒవైసీ తెలిపారు. ఉగ్రవాద కేసుల్లో ఇరుక్కున్న ముస్లిం యువతను బయటకు తీసుకొస్తామని అఖిలేష్ చెప్పటమే కాని, ఇంతవరకు చేసిందేమీ లేదని ఆయన మండిపడ్డారు. ఎప్పుడు ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడే బీజేపీ నేతలు... అఖ్లాక్ తల్లి గురించి, జకియా జాఫ్రీ గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News