: ట్రంప్ అనుకున్నవి అమలు జరగడం అంత ఈజీ కాదు: కేటీఆర్
విదేశాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేసుకునే వారిపై అమెరికా అధ్యక్షుడు విధించిన ఆంక్షలు అమలు కావడం అంత ఈజీ కాదని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నిర్ణయాలు అమలు కావాలంటే, సెనేట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అమెరికాలో తెలంగాణవారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని చెప్పారు. దశల వారీగా అన్ని కార్పొరేషన్లలో 24 గంటల పాటూ తాగు నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. 2018లోపు అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అనధికారికంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.