trump: డొనాల్డ్ ట్రంప్‌ సంతకం ప్రభావం: లక్ష వీసాలు రద్దు చేసినట్లు తెలిపిన అమెరికా ప్రభుత్వం


ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చుతూ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడు మెజారిటీ ముస్లిం దేశాల నుంచి శరణార్థులు, ఇస్లామిక్‌ ఉగ్రవాదులు త‌మ దేశంలోకి ప్ర‌వేశించ‌కుండా ఇటీవ‌లే ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేసిన విషయం విదిత‌మే. 'ఫర్ అమెరికన్స్, హైర్ అమెరికన్స్' నినాదంతో అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన ఆయ‌న‌కు ఆ దేశ ఓట‌ర్లు ప‌ట్టం గ‌ట్ట‌డంతో ఆయ‌న వారి ఆశ‌ల‌కు అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆయ‌న ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్‌పై సంతకం చేసిన అనంతరం దాదాపు లక్ష వీసాలను రద్దుచేసినట్లు అమెరికా ప్రభుత్వం తాజాగా ప్ర‌క‌టించింది. డల్లాస్‌ ఎయిర్‌పోర్టుకు యెమెన్  నుంచి వచ్చిన ఇద్దరు సోదరులు వేసిన కేసుపై విచారణ సందర్భంగా ట్రంప్ స‌ర్కారు ఈ సంఖ్యను బహిర్గతం చేసింది. కాగా, వీసాలున్నా ఎందరిని వెనక్కు పంపారనే అంశంపై మాత్రం స్పందించ‌లేదు.

  • Loading...

More Telugu News