: ఇరాన్‌పై అగ్గిమీద గుగ్గిలమవుతున్న ట్రంప్.. నిప్పుతో చెలగాటం వద్దంటూ తీవ్ర హెచ్చరిక
ఇస్లామిక్ దేశం ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మాజీ అధ్యక్షుడు ఒబామాకు ఉన్నంత దయ తనకు లేదని, అంతటి దయాదాక్షిణ్యాలను తాను చూపబోనని హెచ్చరించారు. ఆర్థిక సంక్షోభం నుంచి ఇరాన్‌ను ఒబామా గట్టెక్కించారని శుక్రవారం ఓ ట్వీట్‌లో ట్రంప్ పేర్కొన్నారు. ఆర్థిక పతనం అంచున చిక్కుకున్న ఇరాన్‌కు ఒబామా 15 వేల కోట్ల డాలర్ల విలువైన ఒప్పందంతో ప్రాణవాయువు అందించారని అందులో పేర్కొన్నారు. తాజాగా శుక్రవారం అమెరికా ఇరాన్‌కు చెందిన 24 మందికిపైగా వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించింది. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ పరీక్షపై ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ కొట్టిపడేసిన రెండు రోజులకే ఇరాన్‌పై కొత్త ఆంక్షలు విధించడం గమనార్హం.