: టిట్ ఫ‌ర్ టాట్‌!.. అమెరికాపై ఇరాన్ ప్ర‌తీకారం.. యూఎస్ రెజ్ల‌ర్ల‌పై నిషేధం


'ముల్లును ముల్లుతోనే తీయాలి'.. 'కుక్క‌కాటుకు చెప్పుదెబ్బ‌' అని పెద్దలు చెబుతుంటారు. అయితే వాటికి అర్థాన్ని చేతల్లో చూపించింది ఇరాన్‌. అగ్ర‌రాజ్యానికి దిమ్మ‌దిరిగేలా 'మీరు నేర్పిన విద్య‌యే..' అంటూ ట్రంప్‌కు ఝ‌ల‌క్ ఇచ్చింది. ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాల్లో ఇరాన్ కూడా ఒక‌టి. ట్రంప్ ఆదేశాల‌పై ర‌గ‌లిపోతున్న ఇరాన్‌కు ఇప్పుడు స‌మ‌యం దొరికింది. ఈనెల 16, 17 తేదీల్లో కెర్మాన్‌షా న‌గ‌రంలో ప్ర‌తిష్ఠాత్మ‌క‌  ‘ఫ్రీస్టైల్‌ ప్రపంచ కప్‌’ పోటీలు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో అమెరికా రెజ్ల‌ర్లు(మ‌ల్ల‌యోధులు) కూడా పాల్గొనాల్సి ఉంది. అయితే వీరు ఆ పోటీల్లో పాల్గొన‌కుండా ఇరాన్ శుక్ర‌వారం వారిపై నిషేధం విధించింది. అమెరికా విధానాల వ‌ల్ల ఆ దేశ మ‌ల్ల‌యోధుల‌పై నిషేధం విధించ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని ఇరాన్ విదేశీ వ్య‌వ‌హారాల‌శాఖ అధికార ప్ర‌తినిధి బ‌హ్ర‌మ్ ఘ‌సేమి తెలిపారు.

  • Loading...

More Telugu News