: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. ఒక్కసారిగా అలిగి వెళ్లిపోయిన ఫైలట్!
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై డ్రామా కొనసాగుతోంది. ఫైలట్ అలగడంతో ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానం రెండు గంటలుగా అక్కడే నిలిచిపోయింది. విమానం బయలుదేరే సమయానికి 10 నిమిషాల ముందు విమానం దిగిన పైలట్, అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ విమానంలో 120 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో పాటు పలువురు అధికారులు కూడా ఉన్నారు. విమానం నుంచి కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుతో కామినేని ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ ఇండియా ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని పంపిస్తామని తెలిపింది.