: వైఎస్సార్సీపీలో చేరిన మాజీ మంత్రి డీఎల్ వర్గీయులు
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వర్గీయులు వైఎస్సార్సీపీలో చేరారు. కడపలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్.. కాజీపేట జెడ్పీటీసీ లక్ష్మీదేవి, మరో ఆరుగురు ఎంపీటీసీలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. కాగా, కడపకు చెందిన ఆరుగురు టీడీపీ కార్పొరేటర్లు నిన్న వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే.