: నా కోసం, నా తండ్రి కోసం మా అమ్మ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోంది: కోర్టుకు తెలిపిన యువ‌కుడు


దుబాయ్‌లోని షార్జా, అల్ మమ్జార్ ప్రాంతంలో మూడు ప్లాస్టిక్ బాక్సులలో మారిజువానా అనే డ్రగ్ తో పట్టుబడిన ఓ 20 ఏళ్ల‌ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌గా అత‌డు.. తన కన్నతల్లే తన కోసం, తన తండ్రి కోసం డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోందని చెప్పాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న త‌మ కుటుంబాన్ని నెట్టుకురావ‌డానికే తాము ఈ డ్రగ్స్ ను స‌ర‌ఫ‌రా చేయ‌డానికి అలవాటు పడ్డామని తెలిపాడు. అనంత‌రం ఆ యువ‌కుడి త‌ల్లిదండ్రుల‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి షార్జా షరియా న్యాయ‌స్థానంలో ప్రవేశపెట్టారు. అనంత‌రం ఈ కేసులో విచారణను న్యాయ‌స్థానం ఈనెల 28వ తేదీకి వాయిదా వేస్తున్న‌ట్లు పేర్కొంది.

  • Loading...

More Telugu News