: సెల్ఫీ తీసుకుని ఫ్రెండుకు పంపి.. ఆత్మహత్య చేసుకున్నసాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌


తాను చనిపోతున్నానంటూ సెల్ఫీ తీసుకొని అనంత‌రం ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న పుణెలో చోటు చేసుకుంది. ప్ర‌ముఖ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (టీసీఎస్)లో పనిచేస్తున్న 23 ఏళ్ల ఉద్యోగి ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడు. ఆ న‌గ‌రంలోని సాంగ్రియా మెగాపాలిస్ సొసైటీలో ఆయ‌న అద్దెకు ఉంటున్నాడు. నిన్న ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డే ముందు దుప్పటితో మెడకు చుట్టుకుని సెల్ఫీ తీసుకుని, దాన్ని త‌న‌ స్నేహితుడికి పంపాడు. అనంత‌రం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందాడు.

ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు అత‌డి పేరు అభిషేక్ కుమార్ అని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ లోని కాన్పూర్ వాసి అయిన అభిషేక్‌ ఎనిమిది లేదా తొమ్మిది నెలల క్రితం టీసీఎస్‌లో ఉద్యోగంలో చేరి, పుణెకు వెళ్లి అక్క‌డ‌ స్నేహితులతో కలసి త్రీ బెడ్‌ రూమ్ ఫ్లాట్‌ లో ఉంటున్నాడ‌ని పోలీసులు వివ‌రించారు. అయితే, తన రూమ్మేట్‌ బయటకు వెళ్లిన సమయంలో అభిషేక్ ఈ ప‌నిచేశాడ‌ని చెప్పారు. అభిషేక్ నుంచి సెల్ఫీ ఫొటో అందుకున్న అత‌డి స్నేహితుడు ఆ సమయంలో అభిషేక్ ఉంటున్న‌ ఫ్లాట్‌లోనే వేరే గదుల్లో ఉన్న వారికి ఫోన్ చేసిచెప్పాడు.

వాళ్లు వెంటనే అభిషేక్ రూమ్‌ తలుపులు బద్దలు కొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. అభిషేక్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే కాసేప‌టికే అభిషేక్ మృతి చెందిన‌ట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అత‌డి ఆత్మహత్యకు గ‌ల కారణాల గురించి తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News