: టీఆర్ఎస్ ఉచ్చులో కాంట్రాక్టు లెక్చరర్లు: మల్లు రవి
కాంట్రాక్టు లెక్చరర్లు టీఆర్ఎస్ పార్టీ ఉచ్చులో పడ్డారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ పార్టీపై బురద చల్లేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టు లెక్చరర్లతో ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చిందని... అయినప్పటికీ, ఇంతవరకు క్రమబద్ధీకరించలేదని విమర్శించారు. దీనికి నిరసనగా టీఆర్ఎస్ భవన్, సెక్రటేరియట్ లను ముట్టడించాలి కానీ, గాంధీ భవన్ ను ముట్టడిస్తే ఎలాగని మల్లు రవి ప్రశ్నించారు.