: అమరావతి పేరుతో కొత్త రిజిస్ట్రేషన్ జిల్లాను ఏర్పాటు చేయనున్న ఏపీ ప్రభుత్వం


అమరావతి పేరుతో కొత్త రిజిస్ట్రేషన్ జిల్లాను ఏర్పాటు చేస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. తుళ్లూరులో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. దీంతోపాటు ఉండవల్లి, తుళ్లూరు, అనంతవరం, మందడంలలో నాలుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి డాక్యుమెంట్ ను ఆధార్ నంబర్ తో అనుసంధానం చేస్తామని చెప్పారు. డబుల్ రిజిస్ట్రేషన్ లను అరికట్టేందుకు కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News