: ములాయం ఏడిస్తే అంగీకరించాం... ఇప్పుడు ప్లేటు మార్చారు: ఆర్ఎల్డీ


ములాయం సింగ్ యాదవ్ ఫోన్ చేసి, పొత్తు కోసం ఏడవటంతోనే తాము అంగీకరించామని, ఇప్పుడు ఆయన కొడుకు కోసం తమను మోసం చేసి ప్లేటు ఫిరాయించారని రాష్ట్రీయ లోక్ దళ్ ఆరోపించింది. మొదట కాంగ్రెస్, సమాజ్ వాదీ (అఖిలేష్) పొత్తును తీవ్రంగా వ్యతిరేకించి, తన నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగుతుందని చెప్పిన ఆయన, పొత్తు కోసం తమను సంప్రదించారని ఆర్ఎల్డీ ప్రధాన కార్యదర్శి జయంత్ సింగ్ తెలిపారు.

ఓ స్నేహితుడు సాయం చేయమని బాధపడుతుంటే, దాన్ని చూసి, రెండు నిమిషాల్లోనే పొత్తునకు అంగీకరించామని ఇప్పుడాయన యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. పొత్తు కుదరని కారణంగా తమ పార్టీ బలహీనపడలేదని, ములాయం తిరస్కరణతో తాము మరింత బలపడ్డామని ఆయన అన్నారు. కాగా, ఈనెల 9 నుంచి కాంగ్రెస్ - ఎస్పీ కూటమి కోసం ములాయం ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News