: తోడబుట్టిన అక్క వదిలేస్తే... అనాధగా మారిన చెల్లికి అన్న అయిన ఎస్పీ!


రక్తబంధం స్వార్థాన్ని వెతుక్కుంటే... మానవత్వం అనుబంధాన్ని పంచిన ఘటన బెంగళూరులోని చిక్ మగళూరులో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... చిక్ మగళూరులో తమ కుటుంబ పెద్ద పోవడంతో ఆ కుటుంబంలోని అక్కాచెల్లెళ్లు ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటూ జీవితాన్ని గడుపుతున్నారు. అక్క ఉద్యోగం చేస్తుంటే, చెల్లి చదువుకుంటోంది. ఈ క్రమంలో అక్క ఓయువకుడి ప్రేమలో మునిగితేలుతూ చెల్లెలిని వదిలేసింది. దీంతో చెల్లెలు జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. దీంతో అక్కకు సర్దిచెప్పే ప్రయత్నం చేసిన పోలీసులకు తాను మేజర్ నని, తన ప్రియుడు కూడా మైనర్ కాదని, తామిద్దరం కొత్త జీవితం ప్రారంభించామని, తమను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేసింది.

దీంతో చదువు మధ్యలో తనను వదిలేస్తే, తన జీవితం నాశనమైపోతుందని చెల్లెలు, తన అక్క కాళ్లావేళ్లాపడి బతిమలాడింది. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు కూడా ఆమె దీనగాథకు చలించిపోగా, వెంటనే ఎస్పీ అణ్ణామలై కల్పించుకుని, 'అక్కను వదిలెయ్యమని, ఒక అన్నగా నీ బాధ్యత నేను స్వీకరిస్తానని, నువ్వు బాగా చదువుకో, నీ విద్యకయ్యే ఖర్చింతా నేను భరిస్తా'నని ప్రకటించారు. దీంతో మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఆయనను అభినందించారు. అలాంటి అధికారులు అండగా ఉంటే ప్రజల రక్షణకు వచ్చిన భయం లేదని తెలిపారు. 

  • Loading...

More Telugu News