: బంతి గింగిరాలు తిరుగుతుంటే ఆడలేరా? ఇండియా వెళితే అవమానమే: ఆస్ట్రేలియాతో కెవిన్ పీటర్సన్


భారత పిచ్ లపై గిరగిరా తిరుగుతూ వచ్చే స్పిన్ బంతులను ఎదుర్కోవడాన్ని సాధ్యమైనంత త్వరగా నేర్చుకోవాలని, నేర్చుకోలేకుంటే, ఇండియా టూర్ ను రద్దు చేసుకోవాలని ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ సలహా ఇస్తున్నాడు. ఈ నెల 23 నుంచి తొలి టెస్టు మ్యాచ్ తో ఆస్ట్రేలియా టూర్ ప్రారంభం కానుండగా, స్పిన్ బంతులను ఆడలేకుంటే, అవమానం తప్పదని హెచ్చరించాడు. స్పిన్ ప్రాక్టీస్ కు స్పిన్ పిచ్ లే అవసరం లేదని, ఏ తరహా పిచ్ పై అయినా స్పిన్ ఆడటాన్ని నేర్చుకోవచ్చని, ఫుట్ వర్క్ ఎంతో ముఖ్యమని చెప్పాడు. 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను ఆడే అలవాటున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు, 75 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను ఆడటం సులభమేనని, అయితే, బంతి గమనాన్ని గమనించాల్సి వుంటుందని చెప్పుకొచ్చాడు. ఫ్రంట్ ఫుట్ పై ఆడితే ఇబ్బందులు తప్పవన్న సంగతిని న్యూజిలాండ్ ఆటగాళ్లను చూసి నేర్చుకోవాలని అన్నాడు. కాగా, 2012లో ఇండియాపై పీటర్సన్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు సిరీస్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News