: తెలంగాణనూ వదిలిపెట్టేది లేదు: చంద్రబాబు


2019 నాటికి తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని తిరుగులేని శక్తిగా నిలిపేందుకు ప్రతి నేతా కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ తెలుగుదేశం నేతలతో సమావేశమైన ఆయన, తెలంగాణ రాష్ట్రాన్ని తాను వదిలిపెట్టబోనని స్పష్టం చేశారు. పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు అందరూ ఐకమత్యంతో కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం పట్టుబట్టాలని, అందుకు క్షేత్ర స్థాయిలో ప్రజా పోరాటాలు చేయాలని తెలిపారు. తెలంగాణలోని టీడీపీ నేతలకు కేంద్రంలో పదవులు ఇచ్చే విషయమై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో తాను ప్రత్యేకంగా మాట్లాడుతానని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News