: ఇండోర్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడి నుంచి భారీగా బంగారం స్వాధీనం
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా సోదాలు నిర్వహిస్తోన్న అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి భారీ మొత్తంలో బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై డీఆర్‌ఐ అధికారులు వివరిస్తూ ఓ ప్రయాణికుడి నుంచి తాము 14 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని, వాటి మొత్తం విలువ 48.72 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.