: ప్రతి తండ్రీ ఒక విషయం తప్పక గుర్తుంచుకోవాలంటున్న సెహ్వాగ్!
ప్రతి తండ్రి ఒకటి తప్పక గుర్తుంచుకోవాలని, ఏదో ఒక రోజు తన కుమారుడు తనని అనుసరిస్తాడని, అది కూడా తండ్రి నుంచి సలహా తీసుకోకుండానేనని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని పోస్ట్ చేసిన సెహ్వాగ్, తన చిన్ననాటి ఫొటో తో పాటు, తన కుమారుడు ఆర్యవీర్ ఫొటోనూ పోస్ట్ చేశాడు. ఈ రెండు ఫొటోల్లో ఒకటి వీరేంద్ర సెహ్వాగ్, మరోటి ఆర్యవీర్ సెహ్వాగ్ అని పేర్కొన్నాడు. చిన్నారి సెహ్వాగ్, ఆర్యవీర్ లిద్దరూ ఈ ఫొటోల్లో కూలింగ్ గ్లాసెస్ ధరించి ఉండటం విశేషం.