: లేటయిందని దర్శకుడు హరీష్ శంకర్ ను విమానంలోకి అనుమతించని సిబ్బంది !
ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ కు చేదు అనుభవం ఎదురైంది. కొందరు మిత్రులతో కలిసి హరీశ్ శంకర్ చెన్నై వెళ్లేందుకు హైదరాబాద్ శివారు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అయితే, వారు నిర్ణీత సమయంలో రాలేదని, అప్పటికే బాగా ఆలస్యమైందని చెబుతూ ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది వారిని విమానంలోకి అనుమతించలేదు. ఈ విషయాన్ని హరీశ్ శంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాలు మాత్రం ఆలస్యంగా నడవవచ్చుకానీ, ప్రయాణికులు కొంచెం ఆలస్యంగా వచ్చినా అనుమతించరన్న మాట అంటూ హరీశ్ ట్వీట్ చేశారు.