virat: ధోని నుంచి అమూల్యమైన సలహాలు తీసుకుంటున్నా: కోహ్లీ


టీమిండియా స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని వ‌న్డే, టీ20 ఫార్మాట్ల‌లోనూ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన త‌రువాత విరాట్ కోహ్లీ ఆ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. తాజాగా కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ... తాను ఇప్పుడు ధోని నుంచి అనేక అమూల్యమైన సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ ఫార్మాట్ల‌లో ధోనికి అపార‌మైన‌ కెప్టెన్సీ అనుభవం ఉంద‌ని, తాను ఆయ‌న నుంచి  టెక్నిక్స్ నేర్చుకుంటున్నాన‌ని చెప్పాడు. ధోని కెప్టెన్సీ అనుభవంతో త‌న‌కు చేస్తోన్న సూచ‌న‌లు చాలా ఉపయోగపడుతున్నాయ‌ని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

ప్ర‌ధానంగా తాను కీలక సమయాల్లో సార‌థ్య బాధ్య‌త‌లు ఎలా నిర్వ‌ర్తించాల‌నే టెక్నిక్ ను ధోని నుంచి తెలుసుకుంటున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నిర్ణయాలు త్వ‌ర‌గా తీసుకోవాల్సి ఉంటుందని, ఆ నేప‌థ్యంలోనే తాను ధోని నుంచి సలహాలు తీసుకోవ‌డానికి వెనుకాడటం లేదని అన్నాడు. జ‌ట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకునే క్రమంలో ధోని ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకునేవాడని కోహ్లీ పేర్కొన్నాడు. నిన్న‌టి టీ20 మ్యాచులో యజ్వేంద్ర చాహల్ బౌలింగ్ కోటా పూర్తయిన తరువాత తాను నెహ్రాను బౌలింగ్ కు దింపాలనుకున్నానని చెప్పిన కోహ్లీ... అయితే, ధోని త‌న‌కు ఇచ్చిన‌ సలహా మేరకు బూమ్రాకి బౌలింగ్ ఇచ్చాన‌ని అన్నాడు. చివరి మూడు బంతుల్లో బూమ్రా రెండు వికెట్లు తీశాడ‌ని, దీంతో ఆ మ్యాచ్ త్వ‌ర‌గా ముగిసిపోయిందని చెప్పాడు. ఇటువంటి స‌మ‌యంలోనే తాను ధోనీ నుంచి స‌ల‌హాలు తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News