: మున్సిపల్ సొమ్ముతిని, పందికంటే హీనంగా బతుకుతున్నారు: జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ నేత పెద్దారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు


అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి వైసీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణం, పెద్దారెడ్డి సొంత ఊరైన తిమ్మంపల్లిలో జేసీ ప్రభాకర్ రెడ్డి హల్ చల్ చేయడమే! ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దారెడ్డి తాడిపత్రి రాగాలేనిది తాను తిమ్మంపల్లి రాలేనా? అని ప్రశ్నించారు. తిమ్మంపల్లిలో ఇల్లు కొనుక్కుంటానని ఆయన చెప్పారు. విజయవాడ, హైదరాబాద్‌, బెంగుళూరు, తాడిపత్రిల్లో తనకు ఇళ్లున్నాయని, ఊటీలో చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉందని ఆయన తన స్థిరాస్తుల చిట్టావిప్పారు.

దీనిపై పెద్దారెడ్డి మండిపడ్డారు. తిమ్మంపల్లిలో చైతన్యవంతులు ఉన్నారని అన్నారు. ఇక్కడి రెడ్లకు పౌరుషం ఉందని చెప్పిన ఆయన, మరి అక్కడ, ఆ ఊర్లో రెడ్లకు పౌరుషం ఉందో లేదో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ఇంతమంది పోలీసులు తమ ఊరికి రావడం ఆశ్చర్యకరమైన విషయమని ఆయన అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమైనా మంత్రా? ఇంత మంది పోలీసులు ఎందుకు సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్నారు? అంటూ మండిపడ్డ ఆయన, తమ గ్రామంలో ఇంత మంది పోలీసులను చూసి ఆశ్చర్యపోయామని ఆయన అన్నారు. మున్సిపల్ సొమ్ము తిన్న జేసీ పందికన్నా హీనంగా బతుకుతున్నారన్న విషయాన్ని ఆయన తెలుసుకోవాలని పెద్దారెడ్డి ఎద్దేవా చేశారు. 

  • Loading...

More Telugu News