: జగనే ఏపీ సమస్యలు పరిష్కరించగలడు!: ఆసక్తి రేపుతున్న వర్మ ట్వీట్


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినీ నటులను వదిలేసి, రాజకీయాల వైపు తన ట్వీట్స్ ను మళ్లించాడు. నిన్న మొన్నటి వరకు పవన్ కల్యాణ్ నటన, రాజకీయాలపై ట్వీట్లు చేసిన వర్మ... తాజాగా ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక చిత్ర పటాన్ని (మ్యాప్) తుపాకీతో పోల్చుతూ కామెంట్లు చేశాడు. పేలేందుకు సిద్ధంగా ఉన్న తుపాకీలా ఏపీ మ్యాప్ ఉందని తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అలాగే 'ఆంధ్రప్రదేశ్‌ అనే తుపాకీని పేల్చి, దాని సమస్యలను తీర్చగలిగేది వైఎస్సార్సీపీ అధినేత జగనే' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఆయన ఒక్కసారిగా జగన్ ను ప్రశంసించడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. మరి కొందరు మాత్రం వర్మ నేడు పొగిడాడంటే, రేపు తెగుడుతాడని, జగన్ ను ఎలా తెగుడుతాడో చూడాలని ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.


  • Loading...

More Telugu News