: సిక్సర్ తో సురేష్ రైనా అర్ధ సెంచరీ
టీమిండియా వన్డే, టీ20 స్పెషలిస్టు సురేష్ రైనా తానెందుకు స్పెషలిస్టో మరోసారి నిరూపించాడు. మూడు టీ20ల సిరీస్ లో సిరీస్ నెగ్గాలంటే గెలిచి తీరాల్సిన చివరి టీ20లో రైనా జూలు విదిల్చాడు. తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో బంతిని బౌండరీ లైన్ దాటిస్తూ పరుగులు పిండుకున్నాడు. బౌలర్ ఎవరైనా తనకు సంబంధం లేదన్నట్టు ధాటిగా ఆడాడు. మంచి బంతులను గౌరవిస్తూ, చెత్త బంతులను బౌండరీ లైన్ దాటించి, అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో 43 బంతులాడిన రైనా 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. రైనా స్పూర్తితో భారీ సిక్సర్ బాదిన ధోనీ 12 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 13 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది.