: రీప్లే చూసి నిరాశ చెందిన కేఎల్ రాహుల్!
టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరిన అనంతరం తీవ్ర నిరాశకు గురయ్యాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న చివరి టీ20లో 8 వ ఓవర్ 2వ బంతిని ఆడిన రాహుల్ దానిని బీట్ చేయలేకపోయాడు. దీంతో అది నేరుగా వెళ్లి మిడ్ వికెట్ ను గిరాటేసింది. దీంతో అంపైర్ ఔట్ ఇవ్వడం కేఎల్ రాహుల్ పెవియన్ చేరడం జరిగిపోయాయి. అయితే బెన్ స్టోక్స్ సంధించిన ఆ బంతి నోబాల్. అంపైర్ దానిని గుర్తించడంలో విఫలం కావడంతో రీప్లేలో దానిని గుర్తించిన రవిశాస్త్రి అంపైర్ ను తప్పుపట్టాడు. దీంతో దానిని మరోసారి రీప్లే చేయడంతో చూసిన రాహుల్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. దీంతో కొంత అసహనంగా కనిపించాడు. కాగా, పది ఓవర్లు ముగిసేరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. ప్రస్తుతం సురేష్ రైనా (46), మహేంద్రసింగ్ ధోనీ (5) ఆడుతున్నారు.