: భద్రాచలం భద్రంగారి హోటల్లో పెసరట్టు అద్భుతంగా ఉందన్న మంత్రి తుమ్మల!


రోడ్డు పక్క హోటల్ లో కమ్మని పెసరట్టు తింటూ తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దర్శనమివ్వడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని భద్రంగారి హోటల్ పెసరట్టుకు పేరు. ఈ విషయం తెలుసుకున్న ఆయన, ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, తాటి వెంకటేశ్వర్లుతో కలిసి ఆ హోటల్ కు వెళ్లారు. ఎటువంటి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా ఉండే ఈ హోటల్ లోని నాపరాతి టేబుల్ పైనే వారు పెసరట్లు తిన్నారు. అనంతరం, పెసరట్టు రుచి అద్భుతంగా ఉందంటూ హోటల్ సిబ్బందిని తుమ్మల అభినందించారు. కాగా, ఈ హోటల్ పెట్టిన భద్రం గతంలో చనిపోయారు. ఈ హోటల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు పిండి రుబ్బేందుకు రోలు, పెసరట్టు వేసేందుకు కట్టెల పొయ్యినే వాడుతున్నామని సిబ్బంది తెలిపారు.

  • Loading...

More Telugu News