: ‘దంగల్’లో ఆ పాత్రలు కత్రినా, కరీనా పోషిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి!: దర్శకుడు సుభాష్ ఘాయ్


ఏ చిత్రానికి అయినా తారగణం అనేది చాలా ముఖ్యమని, చిత్రాన్ని నిలబెట్టేది, పడగొట్టేది ఆ తారాగణమేనని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్ అన్నారు. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘స్టార్స్’ ను కాకుండా, ఆయా పాత్రలకు సరిపోయే నటులను తాను ఎంపిక చేసుకునేవాడినని చెప్పారు. ‘నా ప్రాముఖ్యత ఎప్పుడూ ఒక స్టార్ నటుడికి కాదు కథకే వుండేది. తారాగణం అనేది చాలా ముఖ్యమైన అంశం. దంగల్ చిత్రంలోని గీత, బబిత పాత్రలను కత్రినా కైఫ్, కరీనా కపూర్ పోషిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి!. అలాగే, మహావీర్ ఫొగట్ పాత్రను అనుపమ్ ఖేర్ పోషిస్తే ఎలా ఉంటుంది?

ఆయా పాత్రలకు ఏ నటులైతే న్యాయం చేస్తారని నేను భావిస్తానో వారినే తీసుకుంటాను. స్టార్స్ ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు మాత్రమే వారిని తీసుకుంటాను. నా సినిమా కెరీర్ లో జయాపజయాలు ఎన్నో చూశాను’ అని డెబ్బైరెండేళ్ల సుభాష్ ఘాయ్ చెప్పారు. సుభాష్ ఘాయ్ చివరి చిత్రం 2014లో నిర్మించిన ‘కాంచీ’. ప్రస్తుతం మరో మూడు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ లతో ఆయన బిజీగా ఉన్నారు. ఇందులో ఒక చిత్రానికి ఆయన దర్శకత్వం వహించనున్నారు.

  • Loading...

More Telugu News