: రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. ఎగసి పడుతున్న మంటలు


రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. సమావేశ మందిరంలో మంటలు చెలరేగాయి. దీంతో, అలర్ట్ అయిన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది భారీ ఎత్తున ఎగసిపడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించినట్టు సమాచారం. ఏ మేరకు నష్టం వాటిల్లిందనే సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News