: ట్రంప్ తో మాట్లాడాను...ఒబామా నిర్ణయం అమలు చేస్తామన్నారు: ఆస్ట్రేలియా ప్రధాని


శరణార్థుల విషయంలో పునరాలోచించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సూచించానని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్ బుల్ తెలిపారు. కాన్ బెర్రాలో ఆయన మాట్లాడుతూ, డొనాల్డ్ ట్రంప్ తో తాను మాట్లాడానని అన్నారు. ప్రస్తుతానికి పసిఫిక్‌ ఐలాండ్‌ లోని శరణార్థుల క్యాంపుల్లో చాలామంది ఉన్నారని, ట్రంప్ పాలనా వర్గం వారిలో ఎంతమందికి అమెరికాలో ఆశ్రయం కల్పిస్తుందో చెప్పలేనని తెలిపారు. అక్కడి క్యాంపుల్లో ఎక్కువ మంది ముస్లిం శరణార్థులే ఉన్నారని ఆయన చెప్పారు. అయితే గతంలో ఒబామా ప్రభుత్వం శరణార్థులకు అమెరికాలో ఆశ్రయం ఇచ్చేందుకు అంగీకరించిందని, దానికి కట్టుబడి ఉండాలని తాను గుర్తు చేశానని, తన వివరణతో ట్రంప్ కూడా ఏకీభవించారని, దీంతోనే దేశంలో ఉన్న శరణార్థులకు సంబంధించిన వివరాలు మరోసారి తనిఖీ చేస్తామని, కొత్తగా అనుమతించేవారికి కఠినమైన వెరిఫికేషన్ ఉంటుందని ప్రకటించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. 

  • Loading...

More Telugu News