: బడ్జెట్ సందర్భంగా తడబడి, పొరపడ్డ జైట్లీ
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఈ సందర్భంగా మూడు, నాలుగు సార్లు ఆయన తడబడి, పొరపడ్డారు. కొన్ని సార్లు స్పీకర్, సహచర సభ్యులు పొరపాట్లను సరిదిద్దారు. కొన్ని సార్లు మాత్రం తప్పులు అలాగే దొర్లిపోయాయి. గృహ నిర్మాణ పథకం విషయంలో 30 చదరపు మీటర్లకు బదులుగా 30 చదరపు కిలోమీటర్లుగా జైట్లీ చెప్పారు. అలాగే ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య గురించి చెప్పేటప్పుడు 1.71 లక్షల బదులు 1.71 లక్షల రూపాయలు అని చదివారు.
మరోవైపు, ఈ బడ్జెట్ ప్రసంగాన్ని మొత్తం ఆయన కూర్చొనే చదివారు. నడుం నొప్పితో బాధపడుతున్న ఆయనకు... కూర్చొని చదివే అవకాశాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ కల్పించారు.