: ఆ చిన్నారి పాటకు ముగ్ధురాలై ముద్దుపెట్టిన అనుష్క!
‘స్వచ్ఛభారత్ అభియాన్’కు సంబంధించి ప్రచార సన్నివేశాల చిత్రీకరణ నిమిత్తం బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ ఇటీవల ఒక ప్రాంతానికి వెళ్లింది. అనుష్కకు వీరాభిమాని అయిన ఓ చిన్నారికి ఈ విషయం తెలియడంతో షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లింది. అయితే, అనుష్కను కలిసేందుకు ఆ చిన్నారికి అనుమతి లభించలేదు. అయినప్పటికీ, దూరం నుంచి అనుష్కను చూస్తూ నిలబడి పోయింది. ఈ విషయం తెలుసుకున్న అనుష్క, ఆ చిన్నారికి తనను కలిసే అవకాశం కల్పించింది. తన అభిమాన నటిని కలిసిన ఆనందంతో ఆ చిన్నారి ఒక పాట కూడా పాడింది. సల్మాన్ ఖాన్ సరసన అనుష్క నటించిన సుల్తాన్ చిత్రంలోని ‘జగ్ ఘామెయా’ పాటను ఆ చిన్నారి పాడింది. ఈ పాటకు ముగ్ధురాలైన అనుష్క,చిన్నారిని కౌగిలించుకుని ఆమె బుగ్గపై ముద్దుపెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.