: రాజకీయ పార్టీలకు బడ్జెట్లో ఝలక్ ఇచ్చిన జైట్లీ
కేంద్ర బడ్జెట్లో రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. పార్టీలు స్వీకరించే విరాళాలు నగదు రూపంలో అయితే రూ. 2 వేలకు మించరాదని నియంత్రణ విధించారు. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 20 వేల వరకు ఉంది. రూ. 20 వేల వరకు ఎలాంటి వివరణ లేకుండానే నగదు రూపంలో విరాళాలను స్వీకరించవచ్చు. దీన్ని తాజాగా రూ. 2 వేలకే పరిమితం చేసింది కేంద్ర ప్రభుత్వం. రూ. 2 వేలకు మించి స్వీకరించే విరాళాలు చెక్ లేదా డీడీ లేదా ఆన్ లైన్ లేదా డిజిటల్ రూపంలో ఉండాలని జైట్లీ తెలిపారు. అంతేకాదు ఎవరెవరు విరాళాలు ఇచ్చారో కచ్చితంగా వెల్లడించి తీరాలని చెప్పారు. విరాళాలకు సంబంధించి కచ్చితంగా ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలని తెలిపారు.