: ఇండియా ఎంతో గొప్పది... యాపిల్ చీఫ్ టిమ్ కుక్ ప్రశంసల వర్షం


విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఇండియా అత్యంత అనుకూలమైన దేశమని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ వ్యాఖ్యానించారు. ఇండియాలో అధికంగా పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నామని, రిటైల్ స్టోర్లతో సహా ఎన్నో అంశాలపై చర్చిస్తున్నామని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన ముందడుగని, ఈ నిర్ణయంతో దీర్ఘకాలంలో ఇండియా ఎంతో లాభపడనుందని అన్నారు. నోట్ల రద్దుతో తమ సంస్థ కూడా తాత్కాలిక ఇబ్బందులు పడిందని, అమ్మకాలు తగ్గినప్పటికీ, మెరుగైన ఫలితాలను సాధించామని అన్నారు. ఇండియాలో యాపిల్ సంస్థ పనితీరు సంతృప్తికరంగా సాగుతోందని చెప్పుకొచ్చారు. దేశంలో పెట్టుబడుల వృద్ధికి అపరిమితమైన అవకాశాలు ఉన్నాయని కొనియాడారు.

  • Loading...

More Telugu News