: జైట్లీ ప్రసంగిస్తుండగా బల్ల చరుస్తూ ఆనందం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ


92 ఏళ్లుగా రైల్వేకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సంప్రదాయానికి భిన్నంగా తొలిసారి సాధారణ బడ్జెట్‌లో దాన్ని కలిపేసి ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా జైట్లీ ప్ర‌సంగిస్తూ స్వాతంత్ర్యం వచ్చిన తొలిసారి రైల్వే, సాధారణ ప‌ద్దుల‌ను ఒకేసారి ప్రవేశపెడుతుండడం త‌న‌కు లభించిన విశేష గౌరవమ‌ని వ్యాఖ్యానించారు. అనంత‌రం గ్రామీణ భారతంలో ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడిన విషయం గురించి జైట్లీ మాట్లాడుతుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బల్లచరుస్తూ సంతోషం వ్యక్తంచేశారు.

జైట్లీ మాట్లాడుతూ... దేశంలోని రైతులు, గ్రామీణ ప్రాంత వాసుల‌కు ఉపాధికల్పన, గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కేంద్ర స‌ర్కారు ముఖ్యంగా దృష్టి పెడుతుందని, గ్రామాల్లో వంద శాతం విద్యుదీకరణ సాధించడంలో కృషి చేస్తోంద‌ని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం వ్యవసాయ రుణాలకు రూ.10లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News