: రూ. 3 లక్షల వరకూ వార్షికాదాయం ఉన్న వారికి పన్ను నుంచి మినహాయింపు... బడ్జెట్ ముఖ్యాంశాలు - 3
2017-18 బడ్జెట్ లో రూ. 21.47 లక్షల కోట్ల మేరకు వ్యయ ప్రణాళిక ఉంటుందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. జైట్లీ ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు...
* వార్షిక వ్యయ ప్రణాళిక రూ. 21.47 లక్షల కోట్లు.
* రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ. 4.11 లక్షల కోట్లు.
* రక్షణరంగానికి, పెన్షన్లకు రూ. 2.74,114 కోట్లు.
* శాస్త్ర సాంకేతిక రంగానికి రూ. 34,435 కోట్లు.
* ద్రవ్యలోటు జీడీపీలో 3.2 శాతం.
* వచ్చే ఏడాది ద్రవ్యలోటును 3 శాతానికి పరిమితం చేస్తాం.
* ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణకు ప్రాధాన్యం.
* మార్కెట్ నుంచి రూ. 3.48 లక్షల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యం.
* వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు 1.9 శాతం.
* గత సంవత్సరం 1.81 కోట్ల మంది టాక్స్ రిటర్న్ లు దాఖలు చేశారు.
* వీరిలో పన్ను చెల్లించినది 1.7 కోట్ల మంది.
* రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల వార్షికాదాయం ఉన్నవారు 1.95 లక్షల మంది.
* రూ. 10 లక్షల లోపు ఆదాయం చూపిస్తున్న వారి సంఖ్య 20 లక్షలకు పైనే.
* రూ. 2.5 లక్షల వార్షికాదాయం ఉన్నవారు 99 లక్షల మంది.
* నోట్ల రద్దు తరువాత 34 శాతం పెరిగిన రాబడి.
* 24 లక్షల మంది రూ. 10 లక్షలకు పైగా ఆదాయాన్ని చూపుతున్నారు.
* 1.2 లక్షల మంది రూ. 50 లక్షల ఆదాయాన్ని చూపుతున్నారు.
* పది లక్షలు వార్షికాదాయం దాటిన వారు 24 లక్షలైతే, గత సంవత్సరం కోటికి పైగా కార్లు అమ్ముడయ్యాయి.
* ఇండియాలో వేతన జీవులు 4.2 కోట్ల మంది.
* నవ్యాంధ్ర రాజధాని అమరావతికి భూములిచ్చిన వారికి మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు.
* రూ. 50 కోట్ల టర్నోవర్ దాటని కంపెనీలకు ఆదాయపు పన్నులో 25 శాతం ఊరట.
* ఈ నిర్ణయంతో దేశంలోని 96 శాతం కంపెనీలకు లబ్ధి.
* రూ. 5 కోట్ల టర్నోవర్ లోపున్న కంపెనీలకు ఒక శాతం కార్పొరేట్ పన్ను మినహాయింపు.
* నల్లధనం నిరోధానికి కఠిన చర్యలు.
* రూ. 3 లక్షలు దాటే నగదు చెల్లింపులకు అనుమతి లేదు.
* రూ. 3 లక్షలు దాటే చెల్లింపులు చెక్ లేదా ఆన్ లైన్ ద్వారానే జరగాలి.
* రాజకీయ పార్టీలకు విరాళం రూ. 20 వేలు దాటితే తప్పనిసరిగా లెక్క చూపాల్సిందే.
* పార్టీలకు నగదు విరాళం రూ. 2 వేలకు పరిమితం.
* అంతకు మించి ఇవ్వాలంటే చెక్కు లేదా డిజిటల్ రూపంలోనే ఇవ్వాలి.
* అన్ని పొలిటికల్ పార్టీలూ చట్టం ప్రకారం రిటర్నులు దాఖలు చేయాల్సిందే.
* చారిటీ సంస్థలకు ఇచ్చే విరాళాల్లో పన్ను మినహాయింపు రూ. 2000కు తగ్గింపు
* అత్యధికులు పన్ను పరిధిలోకి రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.
* నోట్ల రద్దు తరువాత వేతన జీవులపై పన్ను భారం తగ్గించాలని నిర్ణయించాం.
* రూ. 3 లక్షల వరకూ వార్షికాదాయం ఉన్న వారికి పన్ను నుంచి మినహాయింపు.
* ఆపై రూ. 5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న వారికి ఊరట. పన్ను భారం 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు.
* రూ. 5 లక్షలలోపు ఆదాయముంటే ఏటా రూ. 2,500 పన్ను పడే అవకాశం.
* రూ. 50 లక్షల వార్షికాదాయం ఉన్నవారిపై 10 శాతం సర్ చార్జ్.
* పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పూ లేదు.
* మిగతా ఆదాయపు పన్ను శ్లాబులు యథాతథం.