: బడ్జెట్ సమయంలో జైట్లీ నోట మహాత్మాగాంధీ మాట!


2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన వివిధ వర్గాల ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన నోట నుంచి మహాత్మాగాంధీతో పాటు పలువురు ప్రముఖులు చెప్పిన మాటలు కూడా జాలువారాయి. 'నిర్ణయం సరైనదైతే... అది ఎన్నటికీ విఫలం కాదు' అన్న గాంధీ ఉద్బోధను ఆయన గుర్తు చేశారు. గాంధీ కలలుగన్నట్టు అవినీతి లేని, పారదర్శక పాలన కోసం తాము పనిచేస్తున్నామని చెప్పారు. ఎస్పీ, ఎస్టీ, మైనార్టీల అభ్యున్నతి కోసం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. నల్లధనం నిర్మూలనకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రజల ధనానికి తాము రక్షకులుగా ఉంటామని తెలిపారు. 

  • Loading...

More Telugu News