: 10 విభాగాలుగా బడ్జెట్ ప్రతిపాదనలు... ఆ వివరాలు!


ఈ సంవత్సరం బడ్జెట్ ను పది విభాగాలుగా విడగొట్టినట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. మెరుగైన పరిపాలన, పేదల సంక్షేమం, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా తదితరాలే లక్ష్యంగా ప్రతిపాదనలు తయారు చేశానని చెప్పుకొచ్చారు. బడ్జెట్ ప్రతిపాదనల విభాగాలు...
1. రైతుల ఆదాయం వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయడం.
2. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఉపాధిని కల్పించేలా మౌలిక వసతులు, పెట్టుబడులు.
3. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం నిర్ణయాలు.
4. పేదలు, బడుగు బలహీన వర్గాల ఆరోగ్యం, వారికి గృహ నిర్మాణం.
5. ఉత్పాదకత, ప్రజల జీవనంలో క్వాలిటీ పెంచేలా ఇన్ ఫ్రాస్ట్రక్చచర్ రూపకల్పన.
6. ఆర్థిక రంగంలో వృద్ధి, స్థిరత్వం కోసం తీసుకునే చర్యలు.
7. పారదర్శకత, వేగంగా లావాదేవీల కోసం డిజిటల్ ఎకానమీ.
8. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలన, మెరుగైన ప్రభుత్వ సేవలు.
9. అందుబాటులోని అన్ని వనరులనూ వాడుకుంటూ, ఆర్థిక స్థిరత్వం దిశగా చర్యలు.
10. నిజాయితీగా పన్నుల వసూళ్ల దిశగా నిర్ణయాలు.

  • Loading...

More Telugu News