: బడ్జెట్ ను వాయిదా వేయరాదని నిర్ణయించుకున్న మోదీ సర్కారు!
2016-17 వార్షిక సాధారణ బడ్జెట్ ను ముందుగా అనుకున్న ప్రకారమే నేడు పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. పార్లమెంట్ సభ్యుడు అహ్మద్ మృతితో బడ్జెట్ ను రేపటికి వాయిదా వేస్తారన్న వార్తలు వచ్చినప్పటికీ, ఆయనకు సంతాపం తెలిపి, రెండు నిమిషాలు మౌనం పాటించిన తరువాత బడ్జెట్ ను సభ ముందుంచాలని ఈ ఉదయం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, బడ్జెట్ పత్రాలను తీసుకువెళ్ళి రాష్ట్రపతిని కలిసి, ఆపై తిరిగి పార్లమెంట్ కు చేరుకున్నారు. ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ సమావేశం జరుగుతుండగా, మరికాసేపట్లో బడ్జెట్ కు లాంఛనంగా ఆమోదం పలకనున్నారు.