: రాష్ట్రపతి ప్రణబ్ మాటలతో ఎంతో అసంతృప్తి: కేవీపీ
బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం తనకెంతో అసంతృప్తిని కలిగించిందని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలుపైనా, అందులో ఉన్న అంశాలు, సమస్యలపైన కనీసం ఆయన ప్రస్తావించను కూడా లేదని కేవీపీ ఆరోపించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్న ప్రత్యేక హోదా అంశం ప్రస్తావన లేదని, తెలుగుదేశం నేతలు చెప్పుకుంటున్నట్టు ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అంశాన్నీ ఆయన ప్రసంగంలో జోడించలేదని ఆరోపించారు. రాష్ట్రానికి తక్షణం హోదాను ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కేవీపీ డిమాండ్ చేశారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే హోదాపై చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ ఎంపీలంతా ఒత్తిడి చేయనున్నట్టు పేర్కొన్నారు.