: కిం కర్తవ్యం... బడ్జెట్ పై మోదీ సర్కారు మల్లగుల్లాలు!


భారత పార్లమెంట్ సంప్రదాయాలు పాటిస్తూ, బడ్జెట్ ను కనీసం ఒక్క రోజు పాటు వాయిదా వేయాలా? లేక ఫిబ్రవరి 1వ తేదీతో ముద్రితమైపోయి సిద్ధంగా ఉన్న బడ్జెట్ ను ముందనుకున్న ప్రకారమే సభ ముందుంచాలా? అన్న విషయమై నరేంద్ర మోదీ సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే బడ్జెట్ ప్రతులు పార్లమెంట్ కు చేరుకున్నాయి. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సైతం పార్లమెంట్ కు వచ్చి, అక్కడి నుంచి రాష్ట్రపతి భవన్ కు వెళ్లారు.

ఇక ఈ ఉదయం 10 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే బడ్జెట్ పై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ మాత్రం బడ్జెట్ ను ప్రవేశపెట్టాలా? వద్దా? అన్నది ప్రభుత్వ నిర్ణయమని వెల్లడించింది. సెంటిమెంటును గౌరవించాలా? లేక మారుతున్న కాలానికి అనుగుణంగా మారి పార్లమెంట్ ను సమావేశపరిచి కేంద్ర మాజీ మంత్రి అహ్మద్ మృతికి సంతాపం తెలిపి, కాసేపు వాయిదా వేసి ఆపై బడ్జెట్ ను ప్రవేశపెడతారా? అన్నది 10 గంటల తరువాత వెల్లడికానుంది.

  • Loading...

More Telugu News