: ఒక్కో బడ్జెట్ కాపీ ముద్రణకు అయిన ఖర్చు వివరం!
స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా సాధారణ, రైల్వే బడ్జెట్ లను కలిపి పార్లమెంట్ ముందుకు తీసుకు వస్తున్న వేళ, ఒక్కో బడ్జెట్ ప్రతి ముద్రణకు రూ. 3,450 ఖర్చు అయినట్టు అధికార వర్గాల సమాచారం. గత నెల 19వ తేదీన నార్త్ బ్లాక్ లో హల్వా తయారీతో బడ్జెట్ ప్రతుల ముద్రణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 788 కాపీలను ముద్రించినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. వీటిని లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు, వివిధ మంత్రిత్వ శాఖల ముఖ్య అధికారులకు అందిస్తారు. మిగతావారి కోసం డిజిటల్ బడ్జెట్ ప్రతులను పంపుతామని అధికారులు తెలిపారు.