: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు.. కిటకిటలాడుతున్న ఆలయాలు
తెలుగు రాష్ట్రాల్లో వసంతి పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు ఉదయాన్నే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ.. సరస్వతీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కొండపై విద్యార్థులకు ప్రత్యేకంగా క్యూలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పెన్ను, అమ్మవారి చిత్రపటం, శక్తి కంకణం, కుంకుమ, ప్రసాదం పంపిణీ చేస్తున్నారు.
తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసరలోనూ వసంత పంచమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమాలు జోరందుకున్నాయి. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు.