: ‘స్వచ్ఛ భారత్’ ప్రచారకర్తగా అనుష్క శర్మ?


‘స్వచ్ఛభారత్’ ప్రచార కర్తగా ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రధాని నరేంద్ర మోదీ నియమించినట్లు సమాచారం. నటిగా, నిర్మాతగా నిత్యం బిజీగా ఉండే అనుష్క, ‘స్వచ్ఛభారత్’లో తన వంతు పాత్ర పోషించేందుకు మద్దతు తెలిపింది. పరిశుభ్రత, మెరుగైన జీవితం, శానిటేషన్, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన నిర్మూలన వంటివి స్వచ్ఛభారత్’ ప్రచారాంశాలుగా ఉన్నాయి. ఐదేళ్లలో యావత్ దేశం పరిశుభ్రతలో ముందు ఉండాలనేది ‘స్వచ్ఛభారత్’ లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న పురుషులకు వాటి అవసరంపై అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాల్లో అనుష్క శర్మ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News