: ఊచకోత కేసులో సజ్జన్ కుమార్ కు ఊరటపై సిక్కుల ఆందోళన


సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ కు ఢిల్లీ కోర్టు విముక్తి కల్పించడంపై ఆనాటి ఘటనలో తమ వారిని పోగొట్టుకున్న బాధితులు నిరసన వ్యక్తం చేశారు. సజ్జన్ ను ఈ కేసులో నిర్ధోషిగా పేర్కొంటూ కోర్టు నిన్న తీర్పునిచ్చింది. దీనిపై ఈరోజు పలువురు బాధితులు ఢిల్లీలో ఆందోళన నిర్వహించారు. 1984 అల్లర్ల ఘటనలో నిందితుల్ని శిక్షించాలని ప్లకార్డులు పట్టుకొని డిమాండు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

ఆందోళనలతో పశ్చిమ ఢిల్లీ ప్రాంతంలోని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ స్థంభించింది. 30 సంవత్సరాల తర్వాత ఈ కేసులో తాము న్యాయం పొందుతామని అనుకున్నామనీ, కానీ, అలా జరగలేదనీ ఆందోళనకారులు ఆగ్రహంతో అన్నారు. దీన్ని తాము ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పారు.

  • Loading...

More Telugu News